🏠 www.spandanadaily.com
Watermark
Newspaper Logo
www.spandanadaily.com | Date: 16 Sep, 2026 | Page: 1

నాగులపల్లిలో సర్ 2026 పై విచారణ

వట్పల్లి, సెప్టెంబర్ 16 (స్పందన) వట్పల్లి మండలంలోని నాగులపల్లి గ్రామంలో సర్-2026 (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ లేని, వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఓటర్ల వివరాలపై బుధవారం విచారణ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, ఎంఆర్ఓ జంగేశ్వర్, జీపీ సంగీత పర్యవేక్షణలో సంబంధిత నోటీసులు, ఓటర్ల వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ గౌడ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన ప్రతి ఓటరి హక్కును కాపాడే విధంగా వివరాలను పరిశీలిస్తున్నాం. ఎవరి ఓటు అనవసరంగా తొలగిపోదు.. ప్రజలు అధైర్యపడకుండా అధికారులకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించాలి అని అన్నారు.మ్యాపింగ్‌లో లోపాలు, పేర్లు లేదా ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్ల నుంచి సంబంధిత వివరాలను సేకరించి, రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తమ వివరాల విషయంలో సందేహాలు ఉన్నవారు సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
🏠 Home