🏠 www.spandanadaily.com
Watermark
Newspaper Logo
www.spandanadaily.com | Date: 17 Sep, 2026 | Page: 1

చిన్న చెల్మెడలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

మునిపల్లి, సెప్టెంబరు 17 ( స్పందన ) మునిపల్లి మండలంలోని చిన్న చె ల్మెడ గ్రామంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను గురువారం నాడు సర్పంచ్ రుద్ర గాయత్రి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రాధాన్యతను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజా పాలన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పలువురు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home