🏠 www.spandanadaily.com
Watermark
Newspaper Logo
www.spandanadaily.com | Date: 22 Sep, 2026 | Page: 1

ఎస్ ఐ ఆర్ నోటీసుల పరిష్కారానికి రసూల్ పటేల్ సహకారం

మునిపల్లి, సెప్టెంబరు 22 ( స్పందన ) మునిపల్లి మండలం మగ్దూంపల్లి గ్రామంలో ఎస్ఐఆర్‌ ప్రక్రియలో జారీ చేసిన నోటీసుల పరిష్కార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అంజయ్య, పాల్గొని నోటీసులకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, ఓటర్లకు అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్లు సమర్పించే విధానంపై కాంగ్రెస్‌ పార్టీ మునిపల్లి మండల ఉపాధ్యక్షుడు రసూల్‌ పటేల్‌ అవగాహన కల్పిస్తూ, ఎస్ఐఆర్‌ ప్రక్రియలో వారికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో జీపీఓ రాజు, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, బీఎల్ఓ, అంగన్‌వాడీ టీచర్‌ సరళ బీఎల్ఏలు ఎంపల్లి శ్రీనివాస్‌, బాయికాడి ఈశ్వరప్ప, వేంపల్లి వీరిశెట్టి, షఫీ ఉద్దీన్‌, బాయికాడి వీరన్న, ఎంపల్లి ఈశ్వరయ్య, ఫిరోజ్‌ఖాన్‌, చల్మెడ వీరేశం, మహబూబ్‌ పటేల్‌, హాజీ పాషా, ఇంతియాజ్‌, సోఫీ, దార్లపల్లి యేసయ్య తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు
🏠 Home