🏠 www.spandanadaily.com
Watermark
Newspaper Logo
www.spandanadaily.com | Date: 28 Sep, 2026 | Page: 1

స్వాతంత్రోద్యమ కాలం నుండి ఏఐఎస్ఎఫ్ పోరాటం: సంగారెడ్డి AISF కార్యదర్శి దత్తు రెడ్డి

హనుమకొండలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్థి ప్రదర్శన లో సంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి దత్తు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ పోరాడుతోందన్నారు. విద్య ప్రతి విద్యార్థి హక్కు అని ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ప్రైవేటీకరణను అరికట్టి మౌలిక వసతులు, అధ్యాపకులు, నిధులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
🏠 Home