కంకోల్ టోల్ ప్లాజా వద్ద బొలెరో పికప్ బోల్తా 25 మంది పత్తి కూలీలకు స్వల్ప గాయాలు..
మునిపల్లి, అక్టోబర్ 30 ( స్పందన ) పత్తి కూలీలతో వెళ్తున్న బొలెరో పికప్ వ్యాన్ కంకోల్ టోల్ ప్లాజా వద్ద శనివారం తెల్లవారు జామున బోల్తా పడింది. కర్నూల్ నుంచి ఏడాకులపల్లికి పత్తి కూలీలను తీసుకెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పిల్లలు, పెద్దలు కలిపి 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న, హైవే అంబులెన్స్, 108 అత్యవసర వైద్య సేవల సిబ్బంది టిఎంటీ జుబేర్, పైలట్ మహేందర్ వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చడంలో హైవే అంబులెన్స్, 108 సిబ్బంది సేవలు అందించారు.